పెళ్లి చేసుకుని రహస్యంగా ఉంచుతుంది

sruthi haasan marriageకమల్‌ హాసన్‌ నట వారసురాలిగా ఎంట్రీ ఇచ్చి కొద్ది కాలంలోనే తనకంటూ ఒక బ్రాండ్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది శృతిహాసన్‌. తాజాగా ఈ అమ్మడు తెలుగు, హిందీ, తమిళ చిత్రాల్లో నటిస్తూ దూసుకు పోతుంది. ఇటీవల ఈమె నటించిన ‘కాటమరాయుడు’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరో వైపు తమిళంలో ఒక సినిమా హిందీలో రెండు సినిమాలను ఈమె కమిట్‌ అయినట్లుగా తెలుస్తోంది. హీరోయిన్‌గా చాలా బిజీగా గడుపుతున్న శృతిహాసన్‌ ప్రేమలో ఉందని గత కొన్ని నెలలుగా మీడియాలో పతాక స్థాయిలో ప్రచారం జరుగుతుంది.

ఇంగ్లాండ్‌కు చెందిన స్టేజ్‌ ఆర్టిస్టు అయిన మైకేల్‌ అనే వ్యక్తితో శృతిహాసన్‌ ప్రేమ వ్యవహారం ఇటీవలే అధికారికంగా బయటకు వచ్చింది. వీరిద్దరు తరచు బయట కలుసుకోవడం, విదేశాల్లో ఇద్దరు చక్కర్లు కొట్టడం చూసి అంతా అవాక్కయ్యారు. అయితే సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం వీరిద్దరు కూడా క్రిస్టియన్‌ మతాచారం ప్రకారం వివాహం చేసుకున్నారు. వీరిద్దరి విషయం కమల్‌ హాసన్‌కు తెలవడం ఆయన ఆగ్రహంతో ఉన్నాడని తమిళ సినీ పరిశ్రమ వర్గాలు అంటున్నారు. వీరి పెళ్లి అయ్యి కూడా దాదాపు మూడు నెలలు అవుతుందని అంటున్నారు. పెళ్లి అయ్యిందని తెలిస్తే అవకాశాలు తగ్గుతాయనే ఉద్దేశ్యంతో పెళ్లి విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నట్లుగా తెలుస్తోంది.