ఇద్దరికీ అదే కావాలి !

sruthi hadsan vishalశ్రుతి హసన్ కు కోలివుడ్ ఏమాత్రం కలిసి రావడం లేదు. శ్రుతి ఇప్పటివరకు తమిళ్ లో నటించిన చిత్రాలేవి ఆకట్టుకోలేదు. ఇక ఈ ఏడాది శ్రుతి ఒక్క తమిళ్ చిత్రంకు సైన్ చేయలేదు. కోలివుడ్ శ్రుతి ఐరెన్ లెగ్ అనే ట్యాగ్ వుంది. అయితే 2014 ఓ హిట్ కొట్టి ఈ ఐరెన్ లెగ్ ట్యాగ్ కు గుడ్ బాయ్ చెప్పాలనుకుటుంది. అందుకే యమా అర్జెంట్ గా ఓ చిత్రానికి సైన్ చేసింది. విశాల్‌ హీరోగా తెరకెక్కుతున్న ఓ సినిమాలో హీరోయిన్‌గా నటించడానికి అంగీకరించింది శృతి. సింగం, సింగం 2 సినిమాలతో తమిళ్‌తో పాటు, తెలుగులో కూడా మంచి క్రేజ్‌ సంపాదించుకున్న హరి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాతో మరోసారి సక్సెస్‌ ట్రాక్‌లోకి రావాలని భావిస్తుంది. ఇక కొంతకాలంగా సరైన హిట్‌ లేక ఇబ్బంది పడుతున్న విశాల్‌ కూడా ఈ సినిమాతోనే ట్రాక్‌లోకి రావాలని చూస్తున్నాడు. మరి మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లు అందించే దర్శకుడు హరి… శృతి, విశాల్‌లకు ఎలాంటి రిజల్ట్‌ ఇస్తాడో చూడాలి.