కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరు సాయం అందిస్తున్నారు. కరోనా కారణంగా ఆర్ధికంగా నష్టపోయిన వారికోసం తమవంతు గా సినీ , రాజకీయ , క్రీడా , బిజినెస్ ఇలా ప్రతి ఒక్కరు ఆర్ధిక సాయం అందిస్తున్నసంగతి తెలిసిందే. ఇప్పటికే చాలామంది పెద్ద మొత్తంలో విరాళాలు ప్రకటి తమ గొప్ప మనసు చాటుకోగా..తాజాగా ఆ లిస్ట్ లో కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ చేరారు.
షారుఖ్ ఖాన్.. తన ఆధ్వర్యంలో ఉన్న రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్, మీర్ ఫౌండేషన్, రెడ్ చిల్లీస్ వీఎఫ్‌ఎక్స్ సంస్థలతో పాటు కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ తరుపున పలు సహాయక కార్యక్రమాలు చేయనున్నట్టు వెల్లడించారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో అందరం కలిసి కట్టుగా ఈ మహామ్మారిని తరిమి కొట్టాలని పిలుపునిచ్చాడు. ఇందులో భాగంగా ముంబాయ, కోల్‌కతా, దిల్లీ నగరాలను ఎంచుకొని అక్కడ పేద ప్రజలను నిత్యావసరాలు అందించడానికి తన సంస్థ పనిచేస్తుందని చెప్పుకొచ్చారు.
అంతే కాకుండా కరోనాను అరికట్టడానికి మన దేశ ప్రధాని నరేంద్ర మోదీపాటు మహారాష్ట్ర సీఎం ఉద్థవ్ థాక్రే, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్‌తో మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేస్తోన్న కృషిని కొనియాడారు. ఇక కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ తరుపున పీఎం సహాయనిధికి విరాళం అందించనున్నట్టు ప్రకటించారు. మరోవైపు మహారాష్ట్ర ముఖ్యమంత్రికి రెడ్ చిల్లీస్ తరుపున విరాళం ప్రకటించారు. ఐతే.. షారుఖ్ విరాళం ఎంత అనేది ప్రకటించలేదు.