హీరోయిన్ శ్రియ తాజాగా ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో ఫాలోవర్స్‌తో మాట్లాడారు. ఈ క్రమంలో ఓ నెటిజన్ శ్రియ యద గురించి ఉద్దేశించి కాస్త శృతిమించి మాట్లాడారు. నెటిజన్ కామెంట్‌ను శ్రియ పట్టించుకోకపోయినా.. ఆమె భర్త ఆండ్రీ మాత్రం దానిపై ఫన్నీగా స్పందించారు.
‘మీ మాటలకు నేను ఏకీభవిస్తున్నా. ఆమెపై ఇంకా ఎక్కువ కామెంట్లు చేయండి.. ప్లీజ్’ అని రిప్లై ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. 2018 మార్చిలో రష్యాకు చెందిన క్రీడాకారుడు ఆండ్రీని శ్రియ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరు స్పెయిన్‌లో ఉన్నారు.