Site icon TeluguMirchi.com

బాబోయ్‌: వాటిని చూస్తేనే వణుకు అలాంటిది ఈత కొట్టిందట!!

sriya saran bఅందాలతార శ్రియ అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగింది. ఈ అమ్మడికి హీరోయిన్‌గా ప్రస్తుతం అడపాదడపా అవకాశాలు మాత్రమే వస్తున్నాయి. తెలుగుతో పాటు హిందీలో కూడా పలు చిత్రాల్లో నటిస్తున్న శ్రియా తాజాగా ఓ బాలీవుడ్‌ సినిమాను పూర్తి చేసుకుని వేసవిని ఎంజాయ్‌ చేయడానికి బయల్దేరింది. వేసవి తాపాన్ని తట్టుకోవడానికి ఫారెన్‌ వెళ్లిన ఈ అమ్మడు ఏకంగా షార్క్‌ చేపలతో కలిసి ఈత కొట్టిందట. ఈ విషయాన్ని శ్రియానే స్వయంగా సోషల్‌ మీడియా ద్వారా వ్యక్తం చేసింది. షార్క్‌ చేపలతో ఈత కొట్టిన శ్రియా ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు.

‘నేను, సముద్రం, బోట్‌లో గడిపిన క్షణాలు నా జీవితంలో మరిచిపోలేనివి’ అని ప్రకటించింది. అంతేకాకుండా ఈగల్‌ రే, మాంటా రే, షార్క్‌ చేపలను చూశాను, వాటితో ఈత కూడా కొట్టాను అని పోస్ట్‌ చేసింది. బాబోయ్‌ షార్క్‌ చేపలను దగ్గరనుండి చూస్తేనే వణుకు పుడుతుంది అలాంటిది ఈ అమ్మడు ఏకంగా అర్థరాత్రి పూట వాటితో ఈత కొట్టిందట. ఇంత ఎంజాయ్‌ చేస్తున్న శ్రియా తనకు అక్కడ నుండి వెనక్కు రావడానికి అస్సలు మనస్సు ఒప్పడం లేదు అంటూ ఈ అమ్మడు చెబుతోంది. ఈ అమ్మడు త్వరలో మరో తెలుగు చిత్రంతో కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సంక్రాంతికి బాలయ్య సరసన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రంతో వశిష్టి దేవిగా వచ్చి మంచి మార్కులను కొట్టేసింది.

Exit mobile version