అమలా కు లేని నొప్పి శ్రీ రెడ్డి కి ఎందుకో..?

తన విషయాల్లోనే కాక పక్క వారి విషయాల్లో కూడా కలగజేసుకోవడం శ్రీ రెడ్డి కి బాగా అలవాటు. ఇప్పటికే పలువురు వ్యక్తుల విషయాల్లో జోక్యం చేసుకొని విమర్శలు ఎదురుకున్న ఈమె..తాజాగా అమలా పాల్ విషయంలో అలాగే చేసుకొని చివాట్లు తింటుంది.

అమలాపాల్‌ రెండో పెళ్లి చేసుకుందంటూ కొత్త భర్తతో లిప్ లాక్ కిస్ పెడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తను ప్రేమించిన ముంబై బేస్డ్ సింగర్ భవీందర్ సింగ్‌తో మూడు ముళ్లు వేయించుకుందని తెగ ప్రచారం జరిగింది. ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని ఆమె మేనేజర్ క్లారిటీ ఇచ్చినప్పటికీ..వీటిపై శ్రీరెడ్డి స్పదించింది. ఈ మేరకు ”బాధపడకు అమలాపాల్‌.. నీ పంజాబీ భర్త బాగానే చూసుకుంటాడు. నాకు పంజాబీలపై నమ్మకం ఉంది.” అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ వాఖ్యల ఫై అమలా అభిమానులు ఫైర్ అవుతున్నారు.