Site icon TeluguMirchi.com

నాగ్ ను టార్గెట్ చేసిన వైట్ల ?

nag and vaitla
స్నూఫ్‌లు తయారుచేయడం దర్శకుడు శ్రీను వైట్ల తర్వాతే ఎవరైన. ఓ రేంజ్ లోపేలుతుంటాయి ఆయన స్నూఫ్‌లు. ఎవరికి గుచ్చుకోవాలి వారికి సరిగ్గా గుచ్చుకుంటాయి. చాలా వరకూ ఇండస్ట్రీనే టార్గెట్ చేస్తుంటాయి ఆయన స్నూఫ్‌లు. ఇప్పుడు విషయానికి వస్తే.. వరుణ్ తేజ్ తో తీయబోయే ‘మిస్టర్’ సినిమాలో కూడా స్నూఫ్‌లను రాసుకున్నాడట వైట్ల. ఈసారి నాగార్జున ఊపిరి, సోగ్గాడే సినిమాలపై సెటైరికల్ స్నూఫ్‌లు వేస్తాడని ఓ వార్త బయటికివచ్చింది.

దింతో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. కింగ్ సమయంలో వైట్లకు నాగ్ మద్య ఏవో ఇగో తేడాలు వచ్చాయనే టాక్ వుంది. ఇప్పుడా కసిని వైట్ల ‘మిస్టర్’ లో చూపిస్తాడా? భావిస్తున్నారు కొందరు. సినిమా అనేది ఓ ఆర్ట్ ఫాం. దాంట్లో వ్యక్తిగత వైరాలు దూరకూడదు. ఆలా దూరితే ఫలితం ‘ఆగడు’లా ఉటుందని కామెంట్స్ చేస్తున్నారు ఇంకొంతమంది. మరి, వైట్ల ఎలాంటి స్నూఫ్‌ ను రెడీ చేశాడో తెలియాలంటే మిస్టర్ రావాల్సిందే.

Exit mobile version