Site icon TeluguMirchi.com

పాపం..శ్రీను వైట్ల కు ఇదికూడానా..?

Srinu-Vaitla-sale-for-house

ఇప్పటికే వరుస పరాజేయాలతో చితికిలపడ్డ శ్రీను వైట్ల కు మరో నష్టం వచ్చింది..ఆగడు, బ్రూస్ లీ, తాజాగా మిస్టర్ కూడా డిజాస్టర్ల జాబితాలో చేరిపోయింది..దీంతో నిర్మాతలకు భారీగా నష్టం వచ్చింది. ఇప్పటికే విన్నర్ మూవీ తో తల పట్టుకున్న నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి).. ఠాగూర్ మధులు, ఇప్పుడు మిస్టర్ దెబ్బ కు దాదాపు రూ. 12 నుండి 15 కోట్ల వరకు నష్టం వచ్చినట్లు తెలుస్తుంది.


ఈ రెండు సినిమాల వల్ల ఇల్లు వాకిలి అమ్ముకోవాల్సిన పరిస్థితికి బయ్యర్లు వచ్చారు..ఇక వారికీ ఎంతో కొంత సెటిల్ చేయకపోతే బాగోదని నిర్ణయానికి నిర్మాతలు వచ్చారు.. సినిమా పరాజయానికి దర్శకుడు శ్రీను వైట్లనే ప్రధాన బాధ్యుడిగా చేస్తున్న నిర్మాతలు.. నష్టాల్ని అతనూ భరించాల్సిందే అంటున్నారట. అతడి పారితోషకంతో పాటు కొంత మొత్తం ఇవ్వాల్సిందే అని.. లేకుంటే తాము బయటపడలేమని.. సినిమాకు ఇష్టానుసారం ఖర్చు పెట్టించి ఇలాంటి ఫలితం మిగిల్చినందుకు నష్టం భరించాల్సిందే అని నిర్మాతలు పట్టుబడుతున్నారట. దీంతో శ్రీను కు ఏం చేయాలో అర్ధం కానీ పరిస్థితిలో ఉన్నాడు.

Exit mobile version