వచ్చిన రెండు మూడు రోజుల్లోనే ఆమె ఓవర్ యాక్షన్ కారణంగా, ఆ తర్వాత కనీసం ఎలాంటి సందడి చేయకుండా ఉండటం వల్ల శిల్పా చక్రవర్తి వెళ్లి పోయింది. వెళ్లి పోయే ముందు అందరి విషయంలో కూడా పాజిటివ్‌గానే రెస్పాండ్ అయ్యింది. కాని బయటకు వచ్చిన తర్వాత ఆమెకు శ్రీముఖి ‘శిల్పగారికి చాలా చరిత్ర ఉంది.. నేనంటే శిల్పకి పడదు’ అంటూ మాట్లాడిన మాటలు నచ్చలేదు. ఆ విషయం బయటకు వచ్చిన తర్వాత చూసిన శిల్ప చాలా డిస్ట్రిబ్ అయ్యిందట. నాకు శ్రీముఖితో ఎలాంటి ఇబ్బంది లేదు. కాని ఆమె మాత్రం ఎందుకు అలా ఊహించుకుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.