తెలుగు బిగ్‌బాస్ సీజన్ 3లో సెకండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ప్రముఖ యాంకర్ శిల్పా చక్రవర్తి అవమానకర రీతిలో బయటకు వచ్చింది. ఆమె ఎలిమినేషన్‌కు నామినేట్ అయిన మొదటి సారే అంటే రెండవ వారంలోనే ఎలిమినేట్ అయ్యింది. శిల్పా చక్రవర్తి ఇంట్లో ఉన్నన్ని రోజులు ఇతర కంటెస్టెంట్స్ ఆమెను దూరంగానే ఉంచి చూశారు. ఆమె మద్యలో వచ్చిన కారణంగా ఎవరు కూడా ఆమెను ఆధరించలేదు. పైగా ప్రేక్షకులు కూడా ఆమెకు ఓట్లు వేసేందుకు ఆసక్తి చూపించలేదు.
వచ్చిన రెండు మూడు రోజుల్లోనే ఆమె ఓవర్ యాక్షన్ కారణంగా, ఆ తర్వాత కనీసం ఎలాంటి సందడి చేయకుండా ఉండటం వల్ల శిల్పా చక్రవర్తి వెళ్లి పోయింది. వెళ్లి పోయే ముందు అందరి విషయంలో కూడా పాజిటివ్‌గానే రెస్పాండ్ అయ్యింది. కాని బయటకు వచ్చిన తర్వాత ఆమెకు శ్రీముఖి ‘శిల్పగారికి చాలా చరిత్ర ఉంది.. నేనంటే శిల్పకి పడదు’ అంటూ మాట్లాడిన మాటలు నచ్చలేదు. ఆ విషయం బయటకు వచ్చిన తర్వాత చూసిన శిల్ప చాలా డిస్ట్రిబ్ అయ్యిందట. నాకు శ్రీముఖితో ఎలాంటి ఇబ్బంది లేదు. కాని ఆమె మాత్రం ఎందుకు అలా ఊహించుకుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.