తెలుగు బిగ్‌బాస్ సీజన్ 3 పదవ వారానికి చేరుకుంది. ఇక కంటెస్టెంట్లంతా కూడా స్ట్రాంగ్‌గా మారుతున్నారు. అందరిలో మంచి రిలేషన్ ఫామ్ అయింది. ఇంట్లోని వారికి కూడా కాస్త హోమ్‌సిక్ మొదలయింది. దాంతో బిగ్‌బాస్ కొంతమందికి మాత్రమే ఇంట్లోని సభ్యులను కలిసే ఛాన్స్ ఇస్తున్నారు. తాజాగా బిగ్‌బాస్ ఇంటి సభ్యులలోని మిత్రులు, కుటుంబ సభ్యులను బిగ్‌బాస్ ఇంటికి తీసుకువచ్చి వారి ముందు కొన్ని బాక్సులనుంచారు. ఒక్కొక్కరిని ఒక్కో బాక్స్ తీసుకోమని ఆదేశించారు. ఆ బాక్స్‌లను ఓపెన్ చేస్తే బిగ్‌బాస్ కన్ను ఉన్న వారికి మాత్రమే ఇంట్లోకి ప్రవేశం, జోకర్ వచ్చిన వారికి నో ఛాన్స్ అని ఆదేశాలు జారీ చేశారు. కాగా వితికకు తమ వారిని కలుసుకునే అవకాశం వచ్చింది.
మహేష్‌కు తన చెల్లిని కలిసే అవకాశం మిస్ అయింది. ఇక తదుపరి శ్రీముఖి సోదరుడు శుశ్రుత్ బాక్స్ ఓపెన్ చేసే టైం వచ్చింది. అయితే శుశ్రత్‌కి కూడా జోకర్ వచ్చినట్టుగా తెలుస్తోంది. దాంతో తమ్ముడిని కలిసే అవకాశం మిస్ అయ్యానని శ్రీముఖి బాగా ఎమోషనల్ అయింది. అంతేకాకుండా ఇంకొక్క ఛాన్స్ బిగ్‌బాస్ అంటూ గుక్కపెట్టి ఏడ్చింది. ఇంట్లో సభ్యులంతా కూడా శ్రీముఖిని చూసి చాలా ఎమోషనల్ అయ్యారు. అయితే చివరకు మిస్ అయిన వారికి అవకాశం ఇస్తారా? లేక అంతేనా అనేది బిగ్‌బాస్‌కు మాత్రమే తెలుసు.