Site icon TeluguMirchi.com

‘శ్రీమంతుడు’ సాంగ్స్ బయటకు వచ్చాయి..

Srimanthudu-Songs-Leakedగత కొంత కాలంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ ని పైరసీ భూతం వెంటాడుతున్న సంగతి తెలిసిందే. ఇపుడు కొత్తగా మరో భూతం కూడా దర్శక నిర్మాతలను ఆందోళనకు గురిచేస్తుంది. అదే ఆడియో సాంగ్స్ లిక్ అవడం, విడుదలకు ముందు సినిమాకు సంబంధించిన పాటలు, సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఆన్ లైన్లో లిక్ అవుతూ వస్తున్నాయి. ఇటీవలే ‘బాహుబలి’ సినిమాకు సంబంధించిన ఆడియో వాట్సాఫ్ లో లీక్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా మహేష్ బాబు నటిస్తున్న ‘శ్రీమంతుడు’ సినిమాకు సంబంధించిన ఆడియో సాంగ్స్ కూడా లీక్ అయ్యాయి. గత రెండు రోజులుగా ఈ పాటలు వాట్సాఫ్, ఇతర సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో చక్కర్లు కొడుతోంది.

కొందరు అభిమానులు ట్విట్టర్లో ఈ పాటలపై రివ్యూలు కూడా రాస్తున్నారు. గతంలో దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన జల్సా, మిస్టర్ పెర్ఫెక్ట్, ఆర్య 2 తో పాటు చాలా సినిమాలు ఇలాంటి లీక్ సమస్యలు ఎదుర్కొన్నాయి. అయితే ఆడియో లీకులపై దర్శక నిర్మాతలు ఎన్నడూ పట్టించుకున్న పాపనా పోలేదు. అందుకే ఆడియో కి సంబదించిన పాటలు ముందుగానే నెట్ లో వస్తున్నాయి అని సినీ పెద్దలు అంటున్నారు.

ఇక శ్రీమంతుడు జూలై 18న ఆడియో ని , ఆగష్టు 9న సినిమా విడుదల చేయబోతునట్లు ప్రకటన చేసారు.

Exit mobile version