‘శ్రీమంతుడు’ అధికారిక రిలీజ్ డేట్…

Mahesh-Babus-Srimanthuduమహేష్ బాబు, శృతి హసన్ జంటగా కొరటాల శివ దర్శకత్వం లో రాబోతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ‘శ్రీమంతుడు’. గత కొద్ది రోజులుగా రిలీజ్ డేట్ విషయం లో తికమక పడుతున్న అబిమానులకు ఓ గుడ్ న్యూస్ అందించారు చిత్ర నిర్మాతలు.

ప్రస్తుతం హైదరాబాద్ లో చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్నశ్రీమంతుడు, జూన్ 27కి షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసి గుమ్మడికాయ కొట్టేయనున్నారు. ప్రిన్స్ మహేష్ బాబు బర్త్ డే కానుకగా ఈ సినిమాని ప్రేక్షకులకు అందించడానికి ప్లాన్ చెయ్యడమే కాకుండా న్యూ రిలీజ్ డేట్ ని కూడా అధికారికంగా ప్రకటన చేసారు.

ఆగష్టు 9న బర్త్ డే జరుపుకుంటున్న మహేష్ , ఈ బర్త్ డే కానుకగా రెండు రోజుల ముందే అనగా ఆగష్టు 7న సినిమాని రిలీజ్ చేస్తునంటు ప్రకటన చేసారు. దీని ప్రకారం రెండు రోజుల ముందు నుంచే మహేష్ బాబు బర్త్ డే సెలబ్రేషన్స్ ప్రపంచం అంత మొదలవుతాయని తెలుస్తోంది. అలాగే చిత్ర ఆడియోని జూలై 18న రిలీజ్ చేస్తున్నారు.