‘శ్రీమంతుడు’ ఆడియో ఎప్పుడంటే..

Mahesh-Srimanthuduకొరటాల శివ – ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ “శ్రీమంతుడు”. ఇప్పటికే ఫస్ట్ లుక్ తో సినిమా ఫై అంచనాలను రెట్టింపు చేసాడు దర్శకుడు. ఇప్పటికే దాదాపు 90% షూటింగ్ పూర్తి చేసుకొని ఆడియో విడుదలకు రెడీ అయ్యింది.

తాజాగా ఈ చిత్ర ఆడియో ని ఈ నెల 27న హైదరాబాద్ లోని శిల్ప కళా వేదిక లో జరుపుటకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే అధికారికంగా ఆడియో డేట్ ని ప్రకటన చేయనున్నారు. రెండో సారి మహేష్ చిత్రానికి దేవి శ్రీ మ్యూజిక్ అందిస్తున్నాడు. మైత్రి మూవీస్ బ్యానర్ ఫై ఈ చిత్రం తెరకెక్కింది. మొదటిసారిగా శృతి హసన్ మహేష్ కు జత కట్టింది. అలాగే ఫ్యామిలీ హీరో నుండి విలన్ రోల్ కు షిఫ్ట్ అయిన జగపతి బాబు మహేష్ కు ఫాదర్ గా నటించాడు.