జ‌ర్న‌లిస్టు చేతికి చిక్కిన శ్రీ‌కాంత్‌

srikanthహిట్ల‌ తో సంబంధం లేకుండా దూసుకుపోవ‌డం, వ‌రుస సినిమాలు చేసుకొంటూ పోవ‌డం ఎలాగో శ్రీ‌కాంత్‌ కి బాగా తెలుసు. అందుకే స్పీడు స్పీడుగా సెంచ‌రీ చేశారు. ఆ త‌ర‌వాత కూడా వేగంగా సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు మ‌రో చిత్రంపై సంత‌కం పెట్టారు. సీరియ‌ర్ పాత్రికేయుడు ప్రభు ద‌ర్శక‌త్వంలో ఆయ‌న న‌టించ‌డానికి ఓకే చెప్పారు. రాజ రాజేశ్వరీ పిక్ఛర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ల‌క్కీతో శ్రీ‌కాంత్ తో ఆడిపాడిన మేఘ‌న క‌థానాయిక‌. ఈనెల 5న చిత్రీక‌ర‌ణ ప్రారంభిస్తారు. యాక్షన్ నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. పోసాని ఓ కీల‌క పాత్ర పోషిస్తారు.