‘నాటు కోడి’ పులుసు వండుతున్న శ్రీకాంత్

srikanth-natukodiశ్రీకాంత్ డబుల్ సెంచరీ వైపు దూసుకుపోతున్నారు. వంద తరవాత… మాస్, యాక్షన్ కధలపై ద్రుష్టి పెట్టిన శ్రీకాంత్ మరోసారి మాస్ కధనే ఎంచుకున్నారు. ‘నాటు కోడి’ గా తెరపైకి వస్తున్నారు. ఈ చిత్రానికి నాని కృష్ణ దర్శకుడు. ఇంతకు ముందు శ్రీకాంత్ తో ‘దేవరాయ’ సినిమా తీసింది ఆయనే. ”అవకాశం రాకే చాలా మంది మంచి వాళ్ళుగా మిగిలిపోతారు. కానీ ప్రతీ ఒక్కరిలో ఓ చెడ్డవాడు ఉంటాడు. మా సినిమా కధ కుడా అదే. ఈ సినిమాలో శ్రీకాంత్ ఓ అవినీతి పరుడైన పోలీస్ అధికారిగా కనిపిస్తారు” అని చెబుతున్నారు దర్శకుడు. జూన్ మొదటి వారంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.