Site icon TeluguMirchi.com

ప‌వ‌న్ తో శ్రీ‌కాంత్ అడ్డాల‌??

pawan-kalyan-srikanth-addalతీసింది రెండే సినిమాలైనా.. త‌న‌కంటూ ఓ ప్రత్యేక‌త‌ను సంపాదించుకొన్నాడు శ్రీ‌కాంత్ అడ్డాల. కొత్తబంగారులోకం, సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు… ఈ రెండు సినిమాలు యువ‌త‌రాన్నే కాదు, కుటుంబ ప్రేక్షకులనూ బాగా ఆక‌ట్టుకొన్నాయి. వాణిజ్యప‌ర‌మైన విజ‌యాల‌తో పాటు, విశ్లేష‌కుల ప్రశంస‌లూ పొందాయి. అందుకే ఇప్పుడు ఓ బంప‌ర్ ఆఫ‌ర్ త‌గిలింది. త్వర‌లోనే శ్రీ‌కాంత్ అడ్డాల ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో సినిమా చేసే అవ‌కాశం ద‌క్కించుకొన్నాడ‌ని టాలీవుడ్ టాక్‌. నాగ‌బాబు త‌న‌యుడు వ‌రుణ్ తేజ్ – శ్రీ‌కాంత్ అడ్డాల కాంబినేష‌న్‌లో ఓ సినిమా వ‌స్తుంద‌ని చెప్పుకొన్నారు. దాని టైటిల్ గొల్లభామ అనుకొన్నారు. అయితే కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇప్పుడు మాత్రం ప‌వ‌న్‌తో సినిమా చేడ‌యం ఖాయ‌మ‌నే అంటున్నారంతా. ప‌వ‌న్ తో పీవీపీ సంస్థ ఓ సినిమా చేయ‌డానికి ఒప్పందం చేసుకొన్నాడు. ఈ సంస్థ‌లోనే ఈ సినిమా ఉంటుంద‌ట‌. త్వర‌లోనే ప‌వ‌న్‌కి శ్రీ‌కాంత్ క‌థ చెబుతాడ‌ని స‌మాచార‌మ్‌. ఆ క‌థ గొల్లభామేనా? లేదంటే మ‌రోటా అనేది తేలాల్సివుంది.

Exit mobile version