Site icon TeluguMirchi.com

రామ్ చరణ్ అంటే కోపం – హీరో శ్రీకాంత్

Srikanth-GAVరామ్ చరణ్ హీరోగా కృష్ణ వంశీ దర్శకత్వంలో వస్తున్న కుటుంబ కధా చిత్రం ‘గోవిందుడు అందరివాడేలే’. రామ్ చరణ్ బాబాయిగా సినిమాకి కీలకమైన పాత్రలో శ్రీకాంత్ నటించారు. ప్రకాష్ రాజ్ , జయసుధ, కాజల్, కమలిని ముఖర్జీ వంటి అగ్ర తారాగణం తో అక్టోబర్ 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అయితే ఈ చిత్ర ప్రెస్ మీట్ లో మాట్లాడిన శ్రీకాంత్ రామ్ చరణ్ అంటే కోపం అని చెప్పాడు.కానీ ఇది నిజ జీవితం లో కాదు సినిమాలో తన పాత్ర గురించి చెప్పాడు. సినిమా లో కొంచెం నెగిటివ్ క్యారెక్టర్ లో ఉండే పాత్ర చేసాడట.

అంతే కాకుండా సినిమా లో తన పాత్ర పేరు ‘బంగారి’. శ్రీకాంత్ కు జోడిగా అత్త కూతురిగా కమలిని ముఖర్జీని నటించింది. మనిషి చాలా మంచోడు, కాకపోతే తన పెళ్లి చేయడం లేదనే కోపంతో తండ్రికి నచ్చని పనులు చేస్తూ ఉంటాడు శ్రీకాంత్. శ్రీకాంత్ , చరణ్, ప్రకాష్ రాజ్ ల మద్య వచ్చే సన్నీ వేషాలు సినిమాకు హైలైట్ అవుతాయని శ్రీకాంత్ తెలిపారు.

అలాగే శ్రీకాంత్ – చరణ్ ల మధ్య ఓ యాక్షన్ సన్నివేశం ఉంది. అందులో నేను రామ్ చరణ్ ను కొడుతూ ఉంటాను. కాని, అతను తిరిగి ఒక్క దెబ్బ కూడా కొట్టాడు. అలా చరణ్ ఎందుకు మౌనంగా ఉండిపోయాడు అనేది సస్పెన్స్ అంటూ శ్రీకాంత్ చెప్పాడు. ‘నిన్నే పెళ్ళాడతా’, ‘మురారి’, ‘చందమామ’ వంటి అద్బుతమైన సినిమా లకు ఏ మాత్రం తీసిపోని సినిమా గోవిందుడు అందరివాడేలే అవుతుంది అని గట్టి నమ్మకం తో ఉన్నాడు శ్రీకాంత్.

Exit mobile version