Site icon TeluguMirchi.com

ఎన్టీఆర్ ప్రసంగంతో ఆసక్తిగా ‘పెదకాపు-1’ టీజర్..


కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి కుటుంబ కథా చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల.. వెంకటేష్ తో ‘నారప్ప’ వంటి యాక్షన్ సినిమా తీసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు కొత్త హీరో విరాట్ కర్ణ తో ‘పెదకాపు-1’ అంటూ మరో యాక్షన్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ‘ఓ సామాన్యుడి సంతకం’ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ సినిమా టీజర్ ను తాజాగా విడుదల చేసారు మేకర్స్.

టీజర్ చూస్తుంటే ఓ గ్రామంలో వర్గాల మధ్య పోరు, రాజకీయాల నేపథ్యంలో సాగే కథగా కనిపిస్తోంది. ఇకపోతే సీనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఇచ్చిన ప్రసంగం బ్యాక్‌గ్రౌండ్‌లో వస్తుండగా టీజర్ మొదలవుతుంది. ఏఊరికైనా నాలుగు దిక్కుటుంట‌య్‌.. కానీ ఈ ఊరికి మాత్రం రెండే దిక్కులు.. ఒక‌టి స‌త్య రంగ‌య్య‌.. రెండ‌వ‌ది బ‌య్య‌న్న‌. ఎవ‌డైనా స‌రే ఈ రెండు దిక్కుల్లో ప‌డి చావాల్సిందే అంటూ ఆ గ్రామంలోని రెండు వర్గాలను పరిచయం చేసారు. ఇక ‘ఇది కేవలం జెండా కాదురా.. మన ఆత్మగౌరవం’ అనే డైలాగ్‍తో ఈ టీజర్ ముగుస్తుంది. టీజర్ ఎండింగ్ లో దర్శకుడు శ్రీ‌కాంత్ అడ్డాల కూడా ఓ పాత్ర‌లో క‌నిస్తుండ‌టం విశేషం. మొత్తానికి టీజర్ చాలా ఇంటెన్స్ గా వుంది.

Peddha Kapu - 1 Teaser | Virat Karrna | Srikanth Addala | Dwaraka Creations

మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను అఖండ వంటి బ్లాక్ బస్టర్ ని అందుకున్న మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. ప్రగతి శ్రీవాస్తవ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో రావు రమేష్, నాగబాబు, తనికెళ్ళ భరణి, రాజీవ్ కనకాల, బ్రిగడ సగ, అనసూయ, ఈశ్వరి రావు, నరేన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఈ సినిమా ఆగస్ట్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version