Srikakulam Sherlockholmes : ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ టైటిల్ సాంగ్ ‘మా ఊరు శ్రీకాకుళం..’ విడుదల


ప్రముఖ హాస్య నటుడు వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో రైటర్ మోహన్ దర్శకత్వంలో ఓ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ రూపొందుతోంది. శ్రీ గణపతి సినిమాస్ బ్యానర్ పై వెన్నపూస రమణ రెడ్డి నిర్మిస్తుండగా, రాజేష్ రాంబాల ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఉన్నారు. ఇక ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మేకర్స్ మ్యూజిక్ ప్రమోషన్స్ కి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ చిత్రంలోని ‘మా ఊరు శ్రీకాకుళం’ టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు.

Kalki 2898 AD : ఆ మూడు ప్రపంచాల మధ్య నడిచే కథే ‘కల్కి 2898 AD’..

సునీల్ కశ్యప్ ఈ పాటను ఆకర్షణీయంగా మరియు హత్తుకునేలా కంపోజ్ చేశారు. శ్రీకాకుళం గురించి సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి రాసిన సాహిత్యం ఆకట్టుకుంది. మంగ్లీ యొక్క ఎనర్జిటిక్ గాత్రం పాటకు మరింత మనోజ్ఞతను తీసుకువచ్చింది మరియు విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇక ఈ చిత్రంలో అనీష్ కురివెళ్ల, రవితేజ మహాదాస్యం, స్నేహ గుప్తా, షియా గౌతం, నాగ మహేష్, భద్రం, కాలకేయ ప్రభాకర్, ప్రభావతి, మచ్చ రవి, మురళిధర్ గౌడ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.