క్లిక్‌ క్లిక్‌ : మైనపు అతిలోక సుందరి

తెలుగు ప్రేక్షకులతో పాటు దేశ వ్యాప్తంగా సినీ అభిమానులను అలరించిన శ్రీదేవి మరణించిన విషయాన్ని ఇప్పటికి కూడా అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఆమె మరణంతో కుటుంబ సభ్యులు కూడా తీవ్ర శోఖ సంద్రంలో మునిగారు. ఆమె మరణించి అప్పుడే సంవత్సరం దాటిపోయింది. ఈ సందర్బంగా సింగపూర్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌ వారు శ్రీదేవి మైనపు విగ్రహంను ఏర్పాటు చేయడం జరిగింది.

ఇప్పటి వరకు ఇండియాకు చెందిన ఎంతో మంది ప్రముఖుల మైనపు బొమ్మలను ఏర్పాటు చేసిన మేడమ్‌ టుస్సాడ్స్‌ వారు ఈసారి శ్రీదేవి విగ్రహంను ఏర్పాటు చేయడం జరిగింది. మైనపు శ్రీదేవి ఎలా ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. తాజాగా నేడు శ్రీదేవి కుటుంబ సభ్యుల చేతుల మీదుగా మైనపు బొమ్మ ఆవిష్కారం అయ్యింది. ఈ సందర్బంగా కుటుంబ సభ్యులు ఎమోషనల్‌ అయ్యి శ్రీదేవితో ఉన్న జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. భర్త బోణీ కపూర్‌, ఇద్దరు కుమార్తెలు మరియు సోదరి మహేశ్వరితో పాటు ఇంకా పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీదేవి మైనపు బొమ్మతో కుటుంబ సభ్యులు ఫొటోలు దిగి ఆనందించారు.