శ్రీ‌దేవికీ పైసా కావాల‌ట‌

sridevi-wants-paisaక్రియేటివ్ ద‌ర్శకుడు కృష్ణవంశీ మరోసారి త‌న మాయ చూపించ‌బోతున్నాడా? త‌న‌లో స‌త్తా ఇంకా త‌గ్గలేద‌ని నిరూపించుకొంటున్నాడా? పైసా గురించి తెలిసిన వాళ్లు ఈమాటే అంటున్నారు. ఈ సినిమాతో మ‌ళ్లీ కృష్ణవంశీ ఫామ్‌ లోకి రావ‌డం ఖాయం అని డంకా బనాయించి మ‌రీ చెబుతున్నారు. కృష్ణవంశీ ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న చిత్రం ‘పైసా’. నాని క‌థానాయ‌కుడు. ర‌మేష్ పుప్పాల నిర్మాత‌. ర‌విబాబు సినిమా ‘అవును’లో కీల‌క పాత్ర పోషించిన చింటూ ఈ సినిమాలో మ‌రోసారి కీల‌క‌మైన పాత్రలో క‌నిపించ‌నున్నారు. సినిమా తుది ద‌శ‌కు చేరుకొంది. త్వర‌లోనే విడుద‌ల చేయ‌డానికి చిత్రబృందం స‌న్నాహాలు చేస్తోంది. ఈ సినిమాకి ఇప్పటికే పాజిటివ్ టాక్ వ‌చ్చింది. ర‌షెష్ చూసిన వారంతా ఈ సినిమా త‌ప్పకుండా అంద‌రినీ థ్రిల్ చేస్తుందంటున్నారు. నాని పాత్రని మ‌ల‌చిన విధానం చాలా కొత్తగా ఉంద‌ని, కొన్ని స‌న్నివేశాల్లో సింధూరం, ఖ‌డ్గం రోజుల నాటి కృష్ణవంశీ గుర్తొస్తాడ‌ని చెబుతున్నారు. ఈ టాక్ పక్క ప‌రిశ్రమ‌ల‌కూ చేరింది. పైసా సినిమా రీమేక్ హ‌క్కుల కోసం అప్పుడే పోటీ మొద‌లైంది. ఈసినిమాని బాలీవుడ్‌ లో రీమేక్ చేయాల‌ని.. శ్రీ‌దేవి భావిస్తోంద‌ట‌. ఈ హ‌క్కుల కోసం.. బోనీక‌పూర్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. విడుద‌ల‌కు ముందే… పైసాకు ఇంత డిమాండ్ ఉంటే.. ఈ సినిమాపై హైప్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. మ‌రి కృష్ణవంశీ ఈ అంచ‌నాల‌ను అందుకొంటాడా? లేదా? అనేది ఆస‌క్తిక‌రం.