Site icon TeluguMirchi.com

దివికేగిన ‘అతిలోకసుందరి’ శ్రీదేవి


తన అందం అభినమయంతో సినీ ప్రేక్షక లోకాన్ని అలరించిన శ్రీదేవి ఇక లేరు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత దుబాయ్‌లో ఆమె కన్నుమూశారు. ఓ వివాహ వేడుకకు హాజరైన ఆమె.. గుండెపోటుతో తుది శ్వాస విడిచారని సంజయ్‌ కపూర్‌ ద్రువీకరించారు

శ్రీదేవి 1963 ఆగగస్టు 13న తమిళనాడులోని శివకాశిలో జన్మించారు. 55ఏళ్ల శ్రీదేవి జీవితంలో సింహభాగం సినీప్రపంచపు వెలుగుజిలుగుల్లోనే గడచిపోయింది. 1967లో బాలనటిగా చిత్రపరిశ్రమలోకి ప్రవేశించిన శ్రీదేవి అయిదు దశాబ్దాలుగా ఈ రంగంపై, భారతీయ సినీ అభిమానులు మాత్రమే కాకుండా.. ప్రపంచ సినీప్రియుల గుండెలపై తనదైన ముద్రవేశారు.

తెలుగు, తమిళ, మలయాళ, హిందీ చిత్రసీమలను కొన్నేళ్లు ఏలిన అతిలోకసుందరి శ్రీదేవి భువి నుంచి దివికి వెళ్లిపోవడం సినీ ప్రేక్షక లోకాన్ని విషాదంలోకి నెట్టింది.

Exit mobile version