బాహుబలిలో రోజుకో సర్ ప్రైజ్ ట్విస్ట్ ఇస్తున్నాడు రాజమౌళి. ప్రభాస్ తో పాటు రానా నీ తెరపైకి తీసుకొచ్చి… ఆశ్చర్యపరిచాడు. ఆ తరవాత సుదీప్‌ని రంగంలోకి దించాడు. ఇప్పుడు శ్రీదేవిపై దృష్టి పెట్టాడు. ఈ అతిలోక సుందరిని మళ్లీ తెలుగు సినిమాల్లోకి తీసుకురావాలి… అని చూస్తున్నాడు. బాహుబలిలో ఆమెకు కూడా స్థానం ఉందట. ప్రభాస్ అమ్మ పాత్రలో శ్రీదేవిని ఎంచుకొంటే ఎలా ఉంటుంది? అనే ఆలోచనలో ఉన్నాడు జక్కన్న. ఈ పాత్రకు సుస్మితాసేన్ని కూడా పరిగణిస్తున్నారు. అంతే కాదు… టబు పేరు కూడా ఈ లిస్టులో ఉంది. మరి ఆ ఛాన్స్ ఎవరికి దక్కుతుందో చూడాలి. నిజంగా శ్రీదేవి గనుక ప్రభాస్‌కి అమ్మగా నటించడానికి ఒప్పుకొంటే… ఈ సినిమా రేంజే వేరుగా ఉంటుంది. మరి అలా జరుగుతుందా? వెయిట్ అండ్ సీ!