Site icon TeluguMirchi.com

డబ్బును చూసుకుంటే దిమ్మతిరిగిందా అతిలోకసుందరి

భారీ అంచనాల నడుమ తెరకెక్కి, అంచనాలకు తగ్గట్టే విడుదలయ్యాక భారీ కలెక్షన్లు రాబట్టి వెయ్యికోట్ల క్లబ్‌లో చేరింది ‘బాహుబలి 2’ చిత్రం. ఈ చిత్రం జాతీయ స్థాయిలో ఉన్న సినీ రికార్డులన్నీ కూడా బ్రేక్‌ చేసి కొత్త రికార్డులను నమోదు చేస్తోంది. ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరికి కూడా మంచి గుర్తింపు వచ్చింది. వెయ్యికోట్ల చిత్రంలో నటించిన వారు అనే గొప్ప ఫేం దక్కింది. ఇక కొంతమంది ఈ చిత్రంలో నటించే అవకాశం వస్తే వదులుకున్న వారు తల పట్టుకుని ఏడుస్తున్నారు. ఈ చిత్రంలో కీలక పాత్ర అయిన శివగామి కోసం మొదటగా అతిలోకసుందరి శ్రీదేవిని సంప్రదించారట. భారీ చిత్రం కావడంతో శ్రీదేవి 5కోట్లను డిమాండ్‌ చేసిందట. దాంతో చిత్ర యూనిట్‌ ఈ అమ్మడికి బాయ్‌ చెప్పేశారు.

తన నటతో ఆకట్టుకునే రమ్యకృష్ణను సంప్రదించారు. రమ్యకృష్ణ ఈ పాత్ర కోసం 2.5 అడిగిందట. దాంతో చిత్ర యూనిట్‌ ఒకే చేశారు. శ్రీదేవి రమ్య కంటే రెట్టింపు డిమాండ్‌ చేసింది. దాంతో ‘బాహుబలి 2’లో భాగం కాలేకపోయింది. డబ్బును చూసుకుంటే అతిలోక సుందరికి దిమ్మదిరిగే షాక్‌ తగిలింది. ఈ విషయాన్ని తెలుసుకున్న ‘బాహుబలి 2’ అభిమానులు మాత్రం మంచి పని అయ్యిందిలే అనుకున్నారు. శివగామి పాత్రకు రమ్యకృష్ణనే పుట్టింది అన్నట్టుగా జీవించేసింది. ఆ పాత్రలో శ్రీదేవిని ఊహించుకోలేకపోతున్నారు. కానీ అతిలోక సుందరి అభిమానులు మాత్రం నిరాశ పడుతున్నారు.

Exit mobile version