శ్రీ శక్తి ఎక్కడమ్మా..?

శ్రీ రెడ్డి నెల క్రితం వరకు ఎవరికీ తెలియదు..తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ ఎక్కువై పోయిందని , తెలుగు అమ్మాయిలకు సరైన అవకాశాలు ఇవ్వడం లేదంటూ పోరాటం మొదలు పెట్టిన ఈమె , ఆ తర్వాత ఫిలిం ఛాంబర్ ఎదుట అర్ద నగ్న ప్రదర్శన చేసి వార్తల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఆ తర్వాత కొన్ని మీడియా చానెల్స్ ఈమెతో తమ టిఆర్పీ రేటింగ్ పెంచుకొనే పనిలో పడ్డాయి. శ్రీ రెడ్డి అసలు స్వరూపం తెలియక, కొంతమంది మహిళా సంఘాలు ఈమెకు మద్దతు ఇవ్వడం , ఈమె వెనుక నడవడం మొదలు పెట్టారు. శ్రీ రెడ్డి కాదు శ్రీ శక్తి అంటూ ఈమెను ఆకాశానికి ఎత్తారు.

ఇప్పుడు శ్రీ రెడ్డి ఎంధుకు ఇలా చేసిందో..ఎవరు చేయించారో బయటపడడం తో అన్ని మూసుకొని కూర్చున్నారు..ఆమె వెంట తిరిగినవారు సైతం షాక్ లో పడ్డారు. ఈమె మాటలు విని మోసపోయామే , ప్రజల ముందు తల ఎత్తుకోకుండా అయిపోయిందేనని బాధ పడుతున్నారట. అందుకే వారు చేయబోయే కార్య క్రమాలకు శ్రీ శక్తి ని పిలవడం కాదు కదా ఆ పేరు కూడా ఎత్తకూడదని నిర్ణయించుకున్నారట. పవన్ రంగం లోకి దిగకముందు వరకు సాయంత్రం అయితే చాలు ఓ.. రెడీ అయి టీవీ చానెల్స్ ముందు కూర్చుని గంటలు గంటలు చర్చలు జరిపేవారు..ఇప్పుడు అంత సైలెంట్ అయ్యారు. కనీసం చూద్దామన్నా శ్రీ శక్తి కనిపించడం లేదట. శ్రీ శక్తి ఎక్కడమ్మా అంటూ సోషల్ మీడియా లో మాట్లాడుకుంటున్నారట.