Site icon TeluguMirchi.com

పోయి..పోయి మంచు ఫ్యామిలీ తో పెట్టుకున్న శ్రీ రెడ్డి…

సినిమా ఇండస్ట్రీ లో చాలామంది మంచు ఫ్యామిలీ గురించి మాట్లాడాలంటే భయపడతారు..ఎందుకంటే ఆ ఫ్యామిలీ కి అధిపతి మోహన్ బాబు..ఆయన ఎంత మంచివారో, కోపం వస్తే అంత చెడ్డవారని అందరూ చెప్పుకుంటారు. అందుకే ఎవరు కూడా ఆయన ముందు మాట్లాడానికి కానీ ఆయన ముందు నిలబడడానికి కానీ భయపడతారు. ఇక విష్ణు , మనోజ్ , లక్ష్మి ఇలా అందరూ కూడా తండ్రి కి చాల భయపడతారు. అలాంటిది శ్రీ రెడ్డి మంచు లక్ష్మి ప్రసన్న ఫై ఆగ్రహం వ్యక్తం చేయడం , మీడియా ముందు ఆమె పరువు తీయడం ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు.

నిర్మాత గా , నటి గా అలాగే యాంకర్ గా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది లక్ష్మి ప్రసన్న. మీము సైతం ప్రోగ్రాం తో ఎంతమందిని ఆదుకుంటుంది. అలాంటి ఆమె గురించి తప్పు గా మాట్లాడింది శ్రీ రెడ్డి. తాజాగా శ్రీ రెడ్డి మీడియా తో మాట్లాడుతూ..” సినిమా ఇండస్ట్రీ లో ఎలాగూ ఛాన్స్ లు ఇవ్వడం లేదు., పోనీ మోడలింగ్ లోనైనా , లేదా యాంకరింగ్ లోనైనా ఛాన్స్ ఇస్తారా అంటే అది ఇవ్వడం లేదు. మంచు లక్ష్మి సైతం యాంకరింగ్ చేస్తూ మమ్మల్ని తొక్కేస్తుందని ” ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. మరి ఈ మాట మోహన్ బాబు వరకు పోతే శ్రీ రెడ్డి పరిస్థితి ఏంటి అని అంత మాట్లాడుకుంటున్నారు.

Exit mobile version