Site icon TeluguMirchi.com

Hanu Man : గూస్‌బంప్స్ తెప్పించేలా ‘శ్రీ రామధూత స్తోత్రం’..


తేజ సజ్జ కథానాయకుడిగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న ‘హనుమాన్’ చిత్రం సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 12న విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరు పెంచారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజైన థియేట్రికల్ ట్రైలర్‌, పాటలకు అద్భుతమైన స్పందన రావడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇక తాజాగా ఈరోజు, మేకర్స్ నాల్గవ సింగిల్ ‘శ్రీరామధూత స్త్రోత్రం’ విడుదల చేశారు.

‘రం రం రం రక్తవర్ణం.. దినకర వదనం.. ‘ అంటూ సాగే ఈ స్తోత్రం అద్భుతమైన విజువల్స్ తో చాలా పవర్ఫుల్ గా వుంది. గూస్‌బంప్స్ రావడం ఖాయం. గౌరహరి అద్భుతంగా కంపోజ్ చేశారు. సాయి చరణ్ భాస్కరుణి, లోకేశ్వర్ ఎడర, హర్షవర్ధన్ చావలి ఎనర్జిటిక్ వాయిస్ పాట థీమ్‌తో ఇంటెన్స్ ని జోడిస్తుంది. ఇక ఈ చిత్రంలో తేజ సజ్జ సరసన అమృత అయ్యర్ కథానాయికగా నటించగా, వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Exit mobile version