‘కొత్తజంట’ లాంటి విభిన్నమైన కథాంశంతో మంచి విజయాన్ని అందుకున్న అల్లు శిరీష్ హీరో గా, వరుసగా సూపర్‌డూపర్ హిట్ చిత్రాలతో అందరి హ్రుదయాలు దోచుకున్న లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా, ఫ్యామిలీ లోని చక్కటి ఎమెషన్స్ ని క్యాచ్ చేసి తన కథలుగా మలుగుకుని విజయాలు అందుకుంటున్న దర్శకుడు పరుశురామ్(బుజ్జి) దర్శకత్వంలో, ఏస్ ప్రోడ్యూసర్ అల్లు అరవింద్ గారు నిర్మాతగా, భారతదేశంలోనే ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ గీతాఆర్ట్స్ బ్యానర్ లో నిర్మిస్తున్న చిత్రానికి ‘శ్రీరస్తు శుభమస్తు’ అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఇప్పటికే ఈ చిత్రం మూడు పాటలు మినహ 90% షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. థమన్.S.S సంగీతం అందిస్తున్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈ సమ్మర్ కి ఈ చక్కటి ఫ్యామిలి ఎంటర్‌టైనర్ ని ప్రేక్షకుల ముందుకు నిర్మాతలు తీసుకువస్తున్నారు..
ప్రతి ఫ్యామిలి లో ఏదో ఓక ఎమెషన్ వుంటుంది. అలాంటి ఎమెషన్ ని చక్కగా క్యాచ్ చేసి దాన్ని కథా వస్తువుగా మార్చుకుని థ్రిల్ కలిగించే కథనాన్ని వెండి తెరపై ప్రెజెంట్ చేయగల దర్శకుడు పరుశురామ్(బుజ్జి). తన ప్రతి చిత్రాన్ని చక్కటి ఫ్యామిలి ఎంటర్‌టైనర్ గా రూపోందించే పరుశురామ్ ఇప్పడు మరో బ్యూటిఫుల్ ఫ్యామిలి ఎంటర్‌టైనర్ ‘శ్రీరస్తు శుభమస్తు’ తో వస్తున్నారు.
దర్శకుడు పరుశురామ్(బుజ్జి) మాట్లాడుతూ ” చాలా రోజులుగా అల్లు శిరీష్ నాకు తెలుసు. తనకి ఎప్పటినుండో మంచి కథని రాయాలనుకునేవాడిని, అందుకే శిరీష్ తో ట్రావెల్ అయ్యాను. శిరీష్ ఎనర్జి సూపర్బ్ అంతకి మించి ఫ్యామిలి అంటే తనకి చాలా ఇష్టం. ఫ్యామిలి కి ఫ్యామిలి మెంబర్స్ కి శిరీష్ ఇచ్చే రెస్పెక్ట్ నాకు నచ్చింది. అందుకే శిరీష్ లో వున్న ఎనర్జి ని వాడుకుని తన వ్యక్తత్వానికి దగ్గరగా వుండే కథని రాశాను. శిరీష్ పాత్రలో ప్రతి ఓక్కరూ తనని తాను చూసుకుంటారు. అంత అందమైన పాత్రలో శిరీష్ అంతకు మించి నటించాడు. ఈ చిత్రంలో శిరీష్ కి జోడిగా లావణ్య త్రిపాఠి నటించింది. అలాగే విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్, రావురమేష్, సుమలత, సుబ్బరాజు, ప్రగతి, ఆలీ, తనికెళ్ల భరణి, , రవి ప్రకాష్, రణధీర్, హంసానందిని, సుమిత్ర లాంటి నటీనటులతో ఈ చిత్రం చేస్తున్నాము. ప్రతి కేరక్టర్ కి ప్రాముఖ్యత వుంటుంది. ప్రతి కేరక్టర్ ఇంకో కేరక్టర్ కి రిలేటివ్ గా వుంటుంది. అంత చక్కగా అన్ని కేరక్టర్స్ సెట్ అయ్యాయి. తెరపై వీరందరి కాంబినేషన్ లో వచ్చే ప్రతి సన్నివేశం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. చూసిన ప్రతివారు వీరంతా రిలేషన్స్ అనుకుంటా అనుకునేలా అందరూ ఇన్‌వాల్వ్ అయ్యి నటించారు. మా శ్రీరస్తు శుభమస్తు చిత్రం మెదటి లుక్ చూసిన వారందరికి ఈ విషయం అర్దమవుతుంది. మా ‘శ్రీరస్తు శుభమస్తు’ చిత్రాన్ని ఈ సమ్మర్ లో ప్రపంచంలోని తెలుగు ప్రేక్షకులందరూ ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాము. మా చక్కటి ఫ్యామిలి ఎంటర్‌టైనర్ కి థమన్.యస్.యస్ సంగీతం అందిస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత అల్లు అరవింద్ గారికి నా ధన్యవాదాలు.”అని అన్నారు..
ప్రతి ఇంటి కుర్రాడి పాత్రలో అల్లు శిరీష్
ప్రతి ఫ్యామిలిలో ప్రతి ఎమెషన్ లో ఓ కుర్రాడు వుంటాడు. ఫ్యామిలి మెంబర్స్ ఎంతమందివున్నా కూడా ఫ్యామిలి అంతా ఓ కుర్రాడి ఎమెషన్ తో బాండింగ్ అయివుంటారు. అతన్ని అందరూ ప్రేమిస్తారు. అలాంటి ప్రతి ఇంట్లొ వుండే చక్కటి కుర్రాడి పాత్రలో అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’ చిత్రంలో నటించారు. కమర్షియల్ చిత్రాల జోలికి వెల్లకుండా వాల్యూస్ వున్న చిత్రాలు చేస్తూ ముందుకు దూసుకుపోతున్న శిరీష్ తను చేసే ప్రతి చిత్రం ప్రేక్షకులని ఓక్కసారి ఆలొచింపజేసే విధంగా చేయాలనే ఓ మంచి వుద్దేశ్యంతోనే చేస్తూ వస్తున్నాడు. ఇప్పడు ఈ సమ్మర్ కి ‘శ్రీరస్తు శుభమస్తు’ అనే చక్కటి బ్యూటిఫుల్ ఫ్యామిలి ఎంటర్‌టైనర్ తో ప్రేక్షకుల ఆశీర్వాదం కోసం వస్తున్నాడు.
హీరో అల్లు శిరీష్ మాట్లాడుతూ “కమర్షియల్ ఫార్ములా చిత్రం లా కాకుండా ఓ మంచి ఫ్యామిలి చిత్రాన్ని దర్శకుడు బుజ్జి నాకు చెప్పారు. వినగానే పాయింట్ చాలా బాగా నచ్చింది. సినిమా వినొదమే కాదు సినిమా ఆలోచించేవిధంగా వుండాలి అని నమ్ముతాను. అలాంటి కథ మా ‘శ్రీరస్తు శుభమస్తు’. టైటిల్ లోనే చాలా పాజిటివ్ వుంది. ఈ టైటిల్ విన్న వారంతా ఇదే చెబుతున్నారు. చాలా ఆనదంగా వుంది. ఈ చిత్రం లో ప్రతి ఓక్క కేరక్టర్ మరో కేరక్టర్ కి రిలేషన్స్ వుంటుంది. చిన్న కేరక్టర్ కి కూడా వ్యాల్యూ వుంటుంది. అలా డిజైన్ చేశారు దర్శకుడు. ఓక సీనియర్ నటుడితో నటిస్తే మనలోని నటన బయటకి వస్తుంది. అది ఈ చిత్రంలో రావు రమేష్ గారికి నాకు మద్య వచ్చే ప్రతి సన్నివేశంలో కానివ్వండి, ఇంకా ఇతర పాత్రలతో నటించినప్పుడు కానివ్వండి. స్ర్రీన్ మీద తెలుస్తుంది. నా కోఆర్టిస్ట్ లావణ్య త్రివాఠి చాలా అందంగా నటించింది. ప్రకాష్‌రాజ్, రావురమేష్, సుమలత, సుబ్బరాజు, ప్రగతి, ఆలీ, తనికెళ్ల భరణి, , రవి ప్రకాష్, రణధీర్, హంసానందిని, సుమిత్ర లాంటి నటీనటులతో ఈ చిత్రం చేస్తున్నాము. అందరూ చక్కటి ఫ్యామిలి మెంబర్స్ లా ఇమిడారు. తప్పకుండా ఈ సమ్మర్ కి ప్రేక్షకుల ఆశీర్వచనాలు అందుకుంటాను..మా చక్కటి ఫ్యామిలి ఎంటర్‌టైనర్ కి థమన్.యస్.యస్ సంగీతం అందిస్తున్నారు. “అని అన్నారు.
ట్రేండి ఫిల్మ్ మేకింలో మాస్టర్ ఎస్ ప్రోడ్యూసర్ అల్లు అరవింద్ గారు.
కమర్షియల్ వాల్యూస్ వున్న చిత్రాలు తీయటమే కాదు కథా బలం వున్న చిత్రాలు తీస్తూ బాక్సాఫీస్ ని షెక్ చేస్తున్న నిర్మాత అల్లు అరవింద్ గారు. ప్రెజెంట్ ట్రెండ్ కి సరిపోయో కథలతో ట్రేండి కమర్షియల్ చిత్రాలు తీయటమే కాకుండా ఈతరం ఫిల్మ్ మేకర్స్ కి ఆదర్శంగా నిలిచారు. భారతదేశంలోనే తెలుగువారు గర్వించదగ్గ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ గీతాఆర్ట్స్ బ్యానర్ పై ఈ సమ్మర్ కి ‘శ్రీరస్తు శుభమస్తు’ అనే చక్కటి ఫ్యామిలి ఎంటర్ టైనర్ ని ప్రేక్షకుల ఆశీర్వచనాలకోసం తీసుకువస్తున్నారు. ఈ చిత్రం యెక్క మెదటి లుక్ ని విడుదల చేశారు.
నిర్మాత అల్లు అరవింద్ గారు మాట్లాడుతూ “90% షూటింగ్ ని ఫినిష్ చేసుకుని మూడు పాటల బ్యాలెన్స్ మాత్రమే వున్న మా చిత్రం ‘శ్రీరస్తు శుభమస్తు’.. ఈ టైటిల్ అనుకోగానే చక్కటి పాజిటివ్ టైటిల్ గా అనిపించింది. ఈ చిత్రానికి ఈ టైటిల్ యాప్ట్. చక్కటి ఫ్యామిలి ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిస్తున్నాం. దర్శకుడు బుజ్జి చాలా మంచి చిత్రాన్ని తీసాడు. ఇప్పటికే ఫస్ట్ లుక్ చూసిన వారందరూ చాలా పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. నటీనటులందరూ చాలా బాగా నటించారు. థమన్ అందించిన ఆడియో సినిమాకి ప్లస్ అవుతుంది. సమ్మర్ లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాము. “అని అన్నారు.
నటీనటులు..
అల్లు శిరిష్, లావణ్య త్రిపాఠి, ప్రకాష్ రాజ్, సుమలత, సుబ్బరాజు, ప్రగతి, ఆలీ, తనికెళ్ల భరణి, రావ్ రమేష్, రవి ప్రకాష్, రణధీర్, సుబ్బరాజు, హంసానందిని, సుమిత్ర తదితరులు నటించారు..
శ్రీరస్తు శుభమస్తు
గీతా ఆర్ట్స్ బ్యానర్
సంగీతం – తమన్.యస్.యస్
యాక్షన్ – రామ్, లక్ష్మణ్
ఆర్ట్ – రామాంజనేయులు
డిఓపి – మని కంతన్
ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్- నాగరాజు
ఎడిటర్ – మార్తాడ్ కె.వెంకటేష్
నిర్మాత – అల్లు అరవింద్
దర్శకుడు – పరశురామ్