Sree Vishnu : కింగ్ ఆఫ్ ఎంటర్టైన్‌మెంట్ శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘సింగిల్’. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి విద్యా కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి నిర్మిస్తున్నారు. కార్తీక్ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మేకర్స్ తాజాగా రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు. ‘సింగిల్’ మూవీ మే 9న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన హిస్టారిక్ డేట్ అనౌన్స్‌మెంట్ వీడియోలో శ్రీ విష్ణు మే 9న విడుదలైన కల్ట్ సూపర్ హిట్స్ గురించి చెబుతుండగా, చివర్లో అల్లు అరవింద్ జైలర్ హుకుం స్టైల్‌లో రిలీజ్ డేట్‌ను లాక్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read : HIT – The 3rd Case : ‘తను’ సాంగ్ తో మ్యాజిక్ చేసిన నాని !
ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు పాటలు చార్ట్ బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. ఈ చిత్రంలో కేతికా శర్మ, ఇవానా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. మ్యూజిక్ కంపోజర్‌గా విశాల్ చంద్ర శేఖర్ పనిచేయగా, సినిమాటోగ్రఫీని ఆర్ వేల్ రాజ్, ఎడిటింగ్‌ను ప్రవీణ్ కెఎల్, ఆర్ట్ డైరెక్షన్‌ను చంద్రిక గొర్రెపాటి నిర్వహిస్తున్నారు. భారీ అంచనాల మధ్య రిలీజ్‌కు సిద్ధమైన ‘సింగిల్’ సినిమా శ్రీ విష్ణుకు మరో హిట్ అందించనుందని అభిమానులు ఆశిస్తున్నారు.