Single Trailer : ‘సింగిల్’ ట్రైలర్ రిలీజ్ కి ముహూర్తం ఫిక్స్ !!


Single Trailer : శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘సింగిల్’ మే 9న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా విడుదల కానుంది. కార్తీక్ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్ వీడియో, పాటలకి మంచి రెస్పాన్స్ రాగా.. రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ అంటూ విడుదల చేసిన వీడియో ఐతే సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇకపోతే తాజాగా ఈ సినిమా నుండి మరో అప్డేట్ అందించారు మేకర్స్.

Also Read :  Sreeleela : రామ్ చరణ్ తో మాస్ స్టెప్పులేయనున్న శ్రీలీల..?

Also Read : ‘సారంగపాణి జాతకం’ గ్రాండ్ సక్సెస్.. టీమ్ హ్యాట్రిక్ హిట్ సెలబ్రేషన్స్ !

ఖచ్చితంగా పరిమితులు లేవు, కింగ్ సైజు ఎంటర్టైన్మెంట్ లోడింగ్ అంటూ ‘సింగిల్’ మూవీ ట్రైలర్ ను ఏప్రిల్ 28 న, మధ్యాహ్నం 3:30 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు అఫిషియల్ గా అనౌన్స్ చేసారు. కాగా విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి విద్యా కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి నిర్మిస్తున్నారు. మరి ఈ చిత్రం శ్రీ విష్ణుకు మరో హిట్ అందించనుందని అభిమానులు ఆశిస్తున్నారు.