Site icon TeluguMirchi.com

శ్రీ రెడ్డి ఆస్తుల విలువ తెలిస్తే షాక్ అవుతారు..

గత కొన్ని రోజులుగా మీడియా లో సంచలనం గా మారిన నటి శ్రీ రెడ్డి..తాజాగా ఆమె ఆస్తుల విలువ ఎంత.ఆమెకు ఎన్ని కార్లు ఉన్నాయ్..ఎన్ని ఎకరాల భూమి ఉందనేది ఓ ఛానల్ డిస్కషన్ లో బయటపడింది. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ ఎక్కువైందని , చాలామంది నన్ను వాడుకుని వదిలేశారని దాని తాలూకా ఆధారాలు సైతం నా దగ్గర ఉన్నాయంటూ మీడియా లో చెపుతున్న శ్రీ రెడ్డి..తన ఆస్తుల విలువ ఎంత..అవి ఎలా వచ్చాయి అనేది చెప్పడం లేదంటూ కరాటే కళ్యాణి ఓ ఛానల్ డిస్కషన్ తెలిపింది.

కరాటే కళ్యాణి మాట్లాడుతూ, శ్రీరెడ్డి 144ఎకరాల రియల్ ఎస్టేట్ వెంచర్ చేస్తోందని, ఆడి, వెర్నా కారులు వున్నాయని, కోటిన్నర ఖరీదైన అపార్ట్ మెంట్ వుందని ఆరోపించడం అందర్నీ షాక్ కు గురి చేసింది. వీటన్నింటికి సాక్ష్యాలు సేకరిస్తానంటూ ఆమె చెప్పడం చూసి నిజం గానే శ్రీ రెడ్డి కి అన్ని ఆస్తులు ఉండే ఉంటాయి..లేకపోతే కళ్యాణి ఎందుకలా పబ్లిక్ గా చెపుతున్నాడని అందరూ మాట్లాడుకుంటున్నారు.

Exit mobile version