గత నాల్గు రోజులుగా సోషల్ మీడియా లో , పలు మీడియా చానెల్స్ లలో శ్రావణ భార్గవి పేరు మారుమోగిపోయింది. దీనికి కారణం శ్రావణి భార్గవి అన్నమయ్య కీర్తనలను తన అందాన్ని వర్ణించేలా ఓ వీడియోను రూపొందించడమే. ఈ వీడియో ఫై వెంకటేశ్వరస్వామి భక్తులు అటు అన్నమయ్య వంశస్తులు మండిపడుతున్నారు. వెంటనే ఆమె పాడిన అన్నమయ్య కీర్తనను యూట్యూబ్ నుంచి డిలీట్ చేయాలంటూ డిమాండ్ చేశారు.
ఈ క్రమంలో ఆమెపై తిరుపతి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో నలువైపుల నుంచి విమర్శలు రావడంతో.. చివరకు శ్రావణ భార్గవి ఆ వీడియోను డిలీట్ చేసేసింది. అయితే ఆమె చేసిన వీడియోలో ఎలాంటి తప్పు లేదని, అది మీ చూపులోనే ఉందని, దుప్పటి కప్పుకున్న అశ్లీలంగానే కనిపిస్తుందని శ్రావణ భార్గవి స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చింది. దీంతో ఈ వివాదం మరింత రాజుకుంది. ఇక చివరకు చేసేదిలేక శ్రావణ భార్గవి తన యూట్యూబ్ ఛానెల్ నుంచి ‘ఒకపరి కొకపరి వయ్యారమై’ వీడియోను డిలీట్ చేసింది.