5 భాషల్లో చేస్తున్న నేను బిగ్‌బాస్‌ కు ఎలా వెళ్తాను?

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 3 లో మొదటి వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీగా తమన్నా సింహాద్రీ వెళ్లింది. ఆమె ఎంపిక తప్పుడు నిర్ణయంగా స్టార్‌ మా వారు తెలుసుకునే లోపు రచ్చ జరిగిపోయింది. ఇక తమన్నా తర్వాత వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీగా శ్రధ్దా దాస్‌ లేదా హెబ్బా పటేల్‌ వెళ్లనుందని అంతా అనుకున్నారు. అయితే అనూహ్యంగా రెండవ వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీగా సీనియర్‌ యాంకర్‌ శిల్ప చక్రవర్తి వెళ్లారు. తాజాగా బిగ్‌బాస్‌ లో తన ఎంట్రీ గురించి మీడియాలో వచ్చిన వార్తలపై శ్రద్దా దాస్‌ స్పందించింది.

ప్రస్తుతం తాను 5 భాషల సినిమాల్లో నటిస్తున్నాను. అలాంటి నేను ఎలా బిగ్‌బాస్‌కు వెళ్తానంటూ అసహనంగా కామెంట్స్‌ చేసింది. ఒక విషయం గురించి మీడియాలో కథనాలు రాసే సమయంలో నన్ను అడగాల్సిన అవసరం ఉంది. కాని నన్ను అడగకుండానే ఇష్టం వచ్చినట్లుగా ఎవరికి వారు అన్నట్లుగా రాసేసుకున్నారు. ఈమె వ్యాఖ్యలపై కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. బిగ్‌బాస్‌లో ఈమెను తీసుకోవాలనుకున్నారు. కాని ఆమె పారితోషికం ఎక్కువ చెప్పడంతో శిల్పను పంపించారు. తనను పంపించలేదనే అక్కసుతో అయిదు భాషల్లో నటిస్తున్న నేను ఎందుకు బిగ్‌బాస్‌కు వెళ్తానంటూ ఎగతాలి చేసినట్లుగా మాట్లాడిందని అంటున్నారు. అసలు విషయం ఆమెకే తెలిసి ఉండాలి.