నాకు న‌ట‌న రాదా?

shraddadasచేతిలో ఒక్క హిట్ లేక‌పోయినా స‌రే… అవ‌కాశాలు అందిపుచ్చుకోవ‌డంలో మాత్రం శ్ర‌ద్దాదాస్ నేర్ప‌రిత‌నాన్ని మెచ్చుకోవ‌ల‌సిందే. యేడాదికి ఒక‌ట్రెండు సినిమాల్లో అయినా మెరుస్తోంది. చిట్టిపొట్టి దుస్తులు వేసుకోవ‌డంలో ఉన్న శ్ర‌ద్ధ‌… న‌ట‌న‌లోనూ పెట్టొచ్చు క‌దా? అని అడిగితే తెగ ఫీలైపోతోంది. “నాకు న‌ట‌న రాదా? ఆ మాట ఎవ‌ర‌న్నారు? నాకు న‌ట‌న రాక‌పోతే ఇన్ని సినిమాలు చేస్తానా? డాన్స్‌లు, దుస్తులూ ఒక్కటే అవ‌కాశాలు తీసుకురావు. న‌ట‌న తెలిస్తేనే ఇక్క‌డ స్థానం“ అంటోంది. అస‌లు త‌న న‌ట‌న చూసే.. రేయ్ సినిమాలో అవ‌కాశం ఇచ్చాట‌ర‌. రేయ్‌లో నాది చాలా కీల‌క‌మైన పాత్ర‌. న‌టించ‌డానికి ఎక్కువ అవ‌కాశం ఉంది. నా న‌ట‌న‌పై ఎవ‌రికైనా అనుమానాలుంటే  రేయ్ తీర్చేస్తుంది“అని ధీమాగా చెబుతోంది.