Site icon TeluguMirchi.com

శ్రద్ద పాత్ర ను రివీల్ చేసిన సుజిత్..

రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్..ప్రస్తుతం సాహో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ ఈ చిత్రంలో హీరోగా నటించగా..బాలీవుడ్ బ్యూటీ శ్రద్ద కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. భారీ యాక్షన్ మూవీ గా తెరకెక్కిన ఈ మూవీ ఆగస్టు 15 న తెలుగు తో పాటు హిందీ , తమిళ్ భాషల్లో విడుదల కాబోతుంది.

ఇక ఈ సినిమాలో శ్రద్ద పాత్ర గురించి డైరెక్టర్ సుజిత్ చెప్పుకొచ్చారు. అసలు ‘సాహో’ కథ హీరోయిన్ పాత్ర పైనే డ్రైవ్ అవుతుందని చెప్పుకొచ్చాడు. టీజర్ కట్ చేసే సమయంలో సుజిత్ ముందు రెండు ఆప్షన్లు అనుకున్నారట.. ప్రభాస్ సీన్ తో టీజర్ ను ప్రారంభించడం ఒకటైతే.. శ్రద్ధా సీన్ తో ప్రారంభించడం మరొకటి. కానీ ఫైనల్ గా టీజర్ ను శ్రద్ధాతో ప్రారంభించేందుకే నిర్ణయం తీసుకున్నారట. దీని వెనక ఉద్దేశం ఏంటంటే ప్రభాస్ పెద్ద స్టార్ అయినా.. అందరి దృష్టి ప్రభాస్ పై ఉంటుందని తెలిసినప్పటికీ హీరోయిన్ కు ప్రాముఖ్యత ఉంటుందనే మెసేజ్ ప్రేక్షకులకు ఇవ్వడమేనట. ఈ సినిమాలో శ్రద్ధా యాక్షన్ సీక్వెన్సులలో డూప్ లేకుండా నటించిందని తెలిపాడు.

Exit mobile version