Site icon TeluguMirchi.com

శ్రద్ధా కపూర్ పెళ్లికి ముస్తాబౌతోందా?

 

 

బాలీవుడ్ లో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించిన శ్రద్ధా కపూర్ సాహో సినిమాతో టాలీవుడ్ కు పరిచయం కాబోతుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ హీరోగా చేస్తున్న ఈ మూవీ ఆగష్టు 15 వ తేదీన రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇందులో శ్రద్ధా  కపూర్ పవర్ఫుల్ కాప్ పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.

అయి

ఇప్పుడు తాజాగా శ్రద్దా కపూర్ కు సంబంధించిన ఓ న్యూస్ వైరల్ గా మారింది. అదేమంటే.. శ్రద్దా కపూర్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. శ్రద్దా కపూర్ చిన్ననాటి స్నేహితుడు, ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ రోహన్ ను వివాహం చేసుకోబోతున్నట్టు సమాచారం అందుతుంది.

కాగా ఈ వార్తలపై ఆమె తండ్రి శక్తి కపూర్ స్పందించాడు. శ్రద్దా కపూర్ ఇప్పట్లో పెళ్లి చేసుకోవడం లేదని, ప్రస్తుతం ఆమె దృష్టి అంతా తన కెరీర్ పైనే ఉందని స్పష్టం చేశాడు. అలాగే సాహోతో పాటు శ్రద్ధా బాలీవుడ్ లో డాన్స్ మూవీ చేస్తుంది.  ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానుంది.

Exit mobile version