ప్రభాస్ లో మరోటి ఉంది – శ్రద్ద కపూర్

యాంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సాహో మూవీ చేస్తున్నాడు. రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ డైరెక్ట్ చేస్తుండగా బాలీవుడ్ భామ శ్రద్ద కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే పలు సందర్భాలలో ప్రభాస్ గురించి చాల గొప్పగా చెప్పిన శ్రద్ద, తాజాగా మరో విషయాన్ని బయటపెట్టింది.

” ప్రభాస్ ఎప్పుడూ సరదగా ఉంటారని, స్టార్ డమ్ తో పని లేకుండా సాధారణంగా ఉండడానికి ఇష్టపడతాని , అందరికి అందుబాటులోనే ఉంటారని, ఆయన్ను చేరుకోవడం చాలా సులభమని అందుకే ప్రభాస్ బాగా నచ్చేసాడని ” శ్రద్ద చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం దుబాయ్ లో జరుగుతున్న సాహో షెడ్యూల్లో శ్రద్ద త్వరలో జాయిన్ కానుంది. నీల్ నితిన్ ముఖేష్ విలన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో మందిరా బేడీ, టిన్ను ఆనంద్, ఎవెలిన్ శర్మ వంటి బాలీవుడ్ స్టార్స్ నటిస్తున్నారు.