Site icon TeluguMirchi.com

స్పైడర్ టీజర్ వాయిదా.

సూపర్ స్టార్ మహేష్ బాబు-మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న స్పైడర్ మూవీ టీజర్ ఈరోజు సాయంత్రం రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెల్సిందే. అయితే దర్శకరత్న దాసరి నారాయణరావు మరణంతో సినీ ప్రేక్షకలోకం శోక సంద్రం లో ఉండటంతో టీజర్ రిలీజ్ ను చిత్రయూనిట్ వాయిదా వేశారు.

ప్రతి ఏడాది కృష్ణ పుట్టిన రోజు కు మహేష్ నటిస్తున్న కొత్త చిత్రానికి సంబదించిన టీజర్ ను రిలీజ్ చేయడం సెంటిమెంట్ కానీ , ఈ సారి మాత్రం ఆ సెంటిమెంట్ కు బ్రేక్ పడింది. తాజా టీజర్ రిలీజ్ డేట్ గురువారం(01-06-2017) ఉదయం 10.30 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నారు. మహేష్ కు జోడిగా రకుల్ ప్రీతి సింగ్ నటిస్తుండగా , హరీష్ జై రాజ్ సంగీతం అందించాడు.

Exit mobile version