Site icon TeluguMirchi.com

‘స్పైడర్’ ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ డేట్.

ప్రిన్స్ మహేష్ బాబు – మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ ‘స్పైడర్’. ప్రస్తుతం చిత్ర షూటింగ్ చివరి భాగానికి వచ్చింది. కేవలం ఓ పాట మినహా మిగతా షూటింగ్ మొత్తం పూర్తియిందని సమాచారం. ఇటీవల మహేష్ షూటింగ్ బ్రేక్ ఇచ్చి కుటుంబంతో కలిసి హాలీడే ట్రిప్ కు కూడా వెళ్లారు. మహేష్ హాలీడే నుండి తిరిగి రాగానే ఆ పాటను కూడా పూర్తి చేస్తారట.

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫస్ట్ లుక్ టీజర్ ను మే 31వ తేదీ సూపర్ స్టార్ క్రిష్ణ పుట్టినరోజు సందర్బంగా రిలీజ్ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే సినిమాని ఆగస్ట్ రెండవ వారంలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట నిర్మాతలు. అయితే ఈ వార్తలపై స్పైడర్ టీమ్ నుండి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. హారీశ్ జైరాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది.

Exit mobile version