Site icon TeluguMirchi.com

‘స్పైడర్’ శాటిలైట్ రైట్స్ ఎంతో తెలుసా..?

spyder-firstlook-gallery

మహేష్ బాబు – మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘స్పైడర్’ మూవీ సరికొత్త రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది..ఇప్పటికే ఫస్ట్ లుక్ తో ఆకట్టుకున్న ఈ మూవీ , తాజాగా శాటిలైట్ రైట్స్ లో సరికొత్త రికార్డు ను నెలకొల్పింది. తెలుగు , తమిళ్ , హిందీ వెర్షన్స్ కు సంబదించిన శాటిలైట్ రైట్స్ ను దాదాపు రూ. 26.5 కోట్లకు జీ నెట్ వర్క్ వారు సొంతం చేసుకున్నట్లు సమాచారం.


ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది..ఈ మూవీ తో మొదటిసారి మహేష్ తమిళ్ ఇండస్ట్రీ లో అడుగుపెట్టబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ కి సంబదించిన తమిళ్ ప్రమోషన్స్ మొదలు పెట్టి సినిమాపై మరింత అంచనాలు పెంచుతున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ యాక్షన్ థ్రిల్లర్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రంలో దర్శకుడు ఎస్ జె సూర్య, తమిళ్ యంగ్ హీరో భరత్ లు వినల్ గా కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి సంగీతం హరీష్ జయ రాజ్. ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మాత.

Exit mobile version