ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ను అఫిషియల్ యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేయగా ఇప్పటి వరకే 7.1 లక్షల వ్యూస్ రాగా 42వేల లైక్స్ వచ్చాయి. తక్కువ సమయంలో ఈ స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకున్న మోషన్ పోస్టర్‌గా ‘స్పైడర్’ రెండో స్థానంలో ఉంది. కచ్చితంగా మొదటి స్థానానికి దూసుకెళుతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. కేవలం మోషన్ పోస్టర్‌తోనే సైత్ ఇండియా రెండో స్థానాన్ని సొంతం చేసుకున్న ‘స్పైడర్’ ముందు ముందు ఇంకా ఎన్ని రికార్డుల మోత మోగిస్తుందో చూడాలి. ఈ చిత్రం జూన్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.