Site icon TeluguMirchi.com

‘స్పైడర్’ వాయిదా వెనుక అసలు కారణం అదేనట..

తెలుగు చిత్ర పరిశ్రమ లో బాహుబలి చిత్రం తర్వాత అంత హైప్ ఉన్న చిత్రం మహేష్ బాబు – మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘స్పైడర్’ మూవీ ఫైనే..ఈ మూవీ కూడా తెలుగు , తమిళ్ భాషల్లో ఏక కాలంలో రూపుదిద్దుకుంటుంది. మొదటగా అన్ని కార్య క్రమాలు పూర్తి చేసుకొని జూన్ నెలలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు.

కానీ తాజాగా ఇప్పుడు చిత్ర రిలీజ్ ను ఆగస్టు కు షిఫ్ట్ చేసారు. దీనికి కారణం క్లైమాక్స్ అని తెలుస్తుంది. వాస్తవానికి క్లైమాక్స్ షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసారు..కానీ సినిమా మొత్తం షూటింగ్ కంప్లీట్ అయ్యాక . క్లైమాక్స్ ఎక్కడో తగ్గినట్లు డైరెక్టర్ , హీరో కు అనిపించడం తో మళ్లీ క్లైమాక్స్ లో కొద్దిగా మార్పులు చేసి మళ్లీ రి షూట్ చేయబోతున్నారట. మే నెలలో ఈ షూట్ పూర్తి చేసి , సినిమాకు గుమ్మడికాయ కొట్టబోతున్నారని వినికిడి. అందుకే జూన్ నెలలో విడుదల కావాల్సింది ఆగస్టు కు మారిందట.

ఇకపోతే మహేష్ ఒక స్పై ఏజెంట్ గా కనిపించనున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ హీరోయిన్ గా, ఎస్.జె సూర్య ప్రతినాయకుడిగా నటిస్తుండగా హరీశ్ జైరాజ్ సంగీతం, సంతోష శివన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Exit mobile version