Site icon TeluguMirchi.com

‘స్పై’ ట్రైలర్.. చివర్లో ట్విస్ట్ అదుర్స్


నిఖిల్ హీరోగా గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ స్పై. నిఖిల్ సరసన ఐశ్వర్యమీనన్ నటిస్తోంది. ఇకపోతే స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక ఉన్న మిస్టరీ నేపథ్యంలో ఈ సినిమా వస్తుండడంతో దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్ సినిమాపై మంచి హైప్‌ను క్రియేట్ చేయగా.. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

చరిత్ర మనకు ఎప్పుడూ నిజం చెప్పదు దాస్తుంది.. దానికి సమాధానం మనమే వెతకాలి అంటూ బ్యాక్ గ్రౌండ్ వాయిస్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం పవర్ఫుల్ యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకుంటుంది. అంతేకాదు సాంకేతికంగా, యుద్ధ సన్నివేశాల పరంగా సినిమా ఎంత గ్రాండియర్‌గా ఉండబోతోందో ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇక నిఖిల్ యాక్షన్‌కు తోడు దగ్గుబాటి రానా కూడా ట్రైలర్‌ చివర్లో కనిపించడంతో సినీ ప్రియుల్లో తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. ‘స్వతంత్రమంటే ఎవరో ఇచ్చేది కాదు.. మనం లాక్కుంటే వచ్చేది’ అంటూ ట్రైలర్ ఎండింగ్‌‌లో రానా చెప్పిన డైలాగ్ హైలైట్‌గా నిలిచింది. ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెంచేశారు మేకర్స్. ఇక శ్రీచరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈ సినిమాను కె రాజశేఖర్ రెడ్డి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. కాగా ‘స్పై’ మూవీ జూన్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

SPY Trailer (Telugu) | Nikhil Siddharth | Garry BH | Charantej Uppalapati | Ishwarya Menon

Exit mobile version