‘స్పైడర్‌’ క్లైమాక్స్‌ షూట్‌ ఎక్కడంటే..??

సూపర్‌మహేష్‌ బాబు ప్రస్తుతం క్రేజీ దర్శకుడు మురుగదాస్‌ దర్శకత్వంలో ‘స్పైడర్‌’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్‌ క్లైమాక్స్‌ మినహా మొత్తం పూర్తయ్యింది. క్లైమాక్స్‌ సన్నివేశాల చిత్రీకరణ ఒకసారి ప్రారంభం అయ్యి కొన్ని మార్పులు చేర్పులకు గురయ్యింది. దాంతో మురుగదాస్‌ మరోసారి పక్కా ప్లాన్‌ చేసి చిత్రీకరణకు సిద్దమవుతున్నారు. ఈ ఆలస్యం వల్లనే ‘స్పైడర్‌’ను ముందుగా అనుకున్న సమయానికంటే ఆలస్యంగా విడుదల కాబోతుంది. ఈ చిత్రానికి తెలుగు మరియు తమిళ భాషల్లో వేరు వేరు క్లైమాక్స్‌లను చిత్రీకరించడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తున్నారు.

ప్రస్తుతం అంతా కూడా చెన్నై వెళ్లడానికి రెడీ అవుతున్నారు. క్లైమాక్స్‌ సన్నివేశాలను చెన్నైలో తెరకెక్కించడానికి ప్లాన్‌ చేస్తున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం క్లైమాక్స్‌ సన్నివేశాలను చెన్నైలో షూట్‌ చేయనున్నారు. ఈ చిత్రంలో మహేష్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్ర మొదటి టీజర్‌ను సూపర్‌స్టార్‌ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 31న విడుదల చేసే సూచనలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని మహేష్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 9న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.