Site icon TeluguMirchi.com

పవన్ బర్త్‌డేకి ‘ఓజి’ నుండి స్పెషల్ ట్రీట్.. ఫ్యాన్స్ కి పండగే


యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సుజీత్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ మాస్ ఎంటర్టైనర్ సినిమా ‘ఓజి’. ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. గ్యాంగ్‌స్టర్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాను DVV దానయ్య భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. ఇకపోతే భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన బిగ్ అప్డేట్ ను రివీల్ చేసారు మేకర్స్.

అదేంటంటే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న తుఫాన్ వచ్చేస్తుంది అంటూ ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. మరి ఆ తుఫాన్ ఏంటనేది తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే. ఈ పోస్టర్ లో ముంబైలో హోటల్ ముందు పవన్ కళ్యాణ్ తన అనుచరులతో గన్స్ పట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ పోస్టర్ చూస్తుంటే సినిమా ఓ రేంజ్ లో ఉంటుందని అర్ధం అవుతుంది. ఇకపోతే ప్రస్తుతం వారాహి యాత్రలో బిజీగా వున్న పవన్ కళ్యాణ్ ‘ఓజి’ తో పాటు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అలాగే ‘హరిహర వీరమల్లు’ సినిమాలు కూడా చేస్తున్నాడు.

Exit mobile version