యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సుజీత్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ మాస్ ఎంటర్టైనర్ సినిమా ‘ఓజి’. ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాను DVV దానయ్య భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. ఇకపోతే భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన బిగ్ అప్డేట్ ను రివీల్ చేసారు మేకర్స్.
అదేంటంటే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న తుఫాన్ వచ్చేస్తుంది అంటూ ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. మరి ఆ తుఫాన్ ఏంటనేది తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే. ఈ పోస్టర్ లో ముంబైలో హోటల్ ముందు పవన్ కళ్యాణ్ తన అనుచరులతో గన్స్ పట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ పోస్టర్ చూస్తుంటే సినిమా ఓ రేంజ్ లో ఉంటుందని అర్ధం అవుతుంది. ఇకపోతే ప్రస్తుతం వారాహి యాత్రలో బిజీగా వున్న పవన్ కళ్యాణ్ ‘ఓజి’ తో పాటు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అలాగే ‘హరిహర వీరమల్లు’ సినిమాలు కూడా చేస్తున్నాడు.
Get ready to face the HEAT WAVE!!
#FireStormIsComing on September 2nd.
#OG fans, brace yourselves… #TheyCallHimOG
pic.twitter.com/dB8G7ihCxY
— DVV Entertainment (@DVVMovies) August 10, 2023