రామ్ చరణ్ కూతురి కోసం ప్రత్యేక రూమ్.. ఎలా ఉందో తెలుసా ?


రామ్ చరణ్ – ఉపాసన దంపతులు జూన్ 20న పండంటి ఆడ‌బిడ్డ‌కి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. మెగా ప్రిన్సెస్ రాకతో అటు మెగాస్టార్ ఇంట, ఇటు అభిమానుల్లో సందడి నెలకొంది. ఇకపోతే మెగా వారసురాలికి ‘క్లిం కారా’ అని నామకరణం కూడా చేసారు. దీనికి సంబంధించిన వేడుక కుటుంబసభ్యుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది.

రవితేజ ‘వెంకీ’ రీ రిలీజ్ డేట్ ఫిక్స్..

ఇకపోతే కూతురు విషయంలో ఉపాసన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఈక్రమంలోనే తమ బిడ్డ ఆహ్లాదకర వాతావరణంలో పెరిగేందుకు ఒక ప్రత్యేక గదిని సిద్ధం చేశారు రామ్‌ చరణ్‌ దంపతులు. ప్రముఖ ఆర్కిటెక్ట్‌ పవిత్రా రాజారామ్‌ నేతృత్వంలో ఉపాసన పుట్టిల్లు అయిన కామినేని నివాసంలో క్లీంకార కోసం ఒక రూమ్‌ను స్పెషల్‌గా డిజైన్‌ చేయించారు. అమ్రాబాద్‌ ఫారెస్ట్‌, వేదిక్‌ హీలింగ్‌ అంశాలను స్ఫూర్తిగా తీసుకుని ఈ ఇంటీరియర్‌ను సిద్ధం చేసినట్లు ఆమె తెలిపారు. అంతేకాదు అపోలో ఆస్పత్రిలో ఉపాసన డెలివరీ రూమ్‌ని కూడా ఇలాగే డిజైన్ చేశారట. దీనికి సంబంధించిన వీడియోను ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఇది వైరల్ అవుతుంది.