Site icon TeluguMirchi.com

మ‌హేష్ బాబుని వాడుకొంటున్న మారుతి

maheshఇంత‌కాలం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని అంతా ఎడా పెడా వాడుకొన్నారు. ఇప్పుడు వారి రూటు మారింది. మ‌హేష్ బాబుపై ప‌డ్డారు. మ‌హేష్ సినిమా పాట‌ల్ని, మాట‌ల్ని టైటిళ్లుగా వాడుకొంటున్నారు. ఆడియో పండ‌గ‌ల‌కు అతిథిగా పిలుస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ఓ సినిమాలో మ‌హేష్ పై పాటే పెట్టేశారు. మారుతి సినిమా ‘ఐ లవ్ యు బంగారం ‘లో మ‌హేష్ బాబుపై ఓ పాట ఉంది. మ‌హేష్ అందాన్ని, సినిమాల్నీ కీర్తిస్తూ ఓ పాట రూపొందించారు. అయితే ఇది ఐటెమ్ సాంగ్ గా వ‌స్తుంది. ‘మిల్క్ బాయ్‌… నా డ్రీమ్ బోయ్ ‘అంటూ సాగే ఈ గీతం మహేష్ అభిమానుల‌కు న‌చ్చుతుంద‌ని చిత్రబృందం చెబుతోంది. మ‌హేష్ ఫ్యాన్స్ కి గాల‌మేస్తున్న మారుతి అందులో ఎంత వ‌ర‌కూ విజ‌యం సాధిస్తాడో చూడాలి.

Exit mobile version