తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ – కె.ఎస్.రవికుమార్‌ల కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కనుంది. అనుష్కను ఓ కథానాయికగా ఎంచుకొన్నారు. మరో నాయిక స్థానం సోనాక్షి సిన్హాకు దక్కినట్టు సమాచారమ్. విక్రమసింహా తరవాత రజనీ చేస్తున్న ప్రాజెక్ట్ ఇదే. రజనీ – రవికుమార్లది విజయవంతమైన కాంబినేషన్. వీరిద్దరి కలయికలో ఎన్నో హిట్ చిత్రాలొచ్చాయి. అందులో నరసింహా చిత్రాన్ని రజనీ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఈ సినిమా విషయానికొస్తే… ఇదో రొమాంటిక్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. కాలమాన పరిస్థితులను బట్టి శృంగారం ఎలా మార్పు చెందుతోంది, మనిషికీ – శృంగారానికీ దూరం తగ్గుతుందా? పెరుగుతోందా? అనే విషయాలన్ని ఈ సినిమాలో చర్చిస్తున్నారట. ఈ వయసులో రజనీ శృంగారం గురించి వర్ణిస్తాడన్నమాట. రజనీకాంత్ కదా.. ఏ వయసులో అయినా, ఏమైనా చేయగలడు.